ముప్పై ఏళ్ళక్రితం క్రితం ఎదో సామాను రిపేర్ అవసరం అయ్యి హైదరాబాద్ లోని అమీర్ పేటలో శేష్ మహల్ సినిమా హలు పక్కనే ఉండే ఒక ఫేమస్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ షాపుకు వెళ్లాను (అది ఇప్పుడు ఉందో లేదో ). ఆ షాపతను పక్క నే ఉన్న గల్లీ లో నేను తీసుకొచ్చిన ఫారెన్ సామాన్లు లాంటివి రిపేర్ చేస్తారని చెప్తే దానికోసం వెతుక్కుంటూ వెళ్ళాను. ఒకాయన, మన ప్రాంతం కాదేమో, హిందీలో మాట్లాడుతూ, నా రిపేర్ వస్తువును తీసుకుని ఒక రోజు తర్వాత కనిపించమన్నాడు. నా మనసు బితుకు బితుకు మంది. ఎందుకంటే ఆ రోజుల్లో నా దగ్గర కొన్ని వింత వింత సామాన్లు ఉండేవి. అందులో ఇది ఒకటి. ఈ వస్తువు టార్చ్ లాగా మూడు స్టేజెస్ లో లైట్ ఇస్తుంది, తర్వాత పోలీస్ అలారమ్ లాగా మోగుతుంది, అలాగే మొహమాటం లేకుండా ట్రాన్సిస్టర్లా కూడా పని చేసేది అంటే త్రి-ఇన్-వన్ అన్నమాట. అట్లాంటివి నాకు ఫారిన్నుండి మా అన్నయ్య, ఇతర బంధువులు ఇచ్చేవారు. అవి రిపేర్ కు వస్తే మటుకు పడేయాలి తప్పితే వేరే దారి ఉండేది కాదు. అవన్నీ ఆ వ్యక్తి దగ్గర బాగు చేయించుకునే వాడిని ఆ తర్వాత నుంచి. ఒక రెండేళ్లక్రితం అలాంటి వస్తువేదో అదేనండి పెన్ లాగ జేబులో పెట్టుకో వచ్చు కానీ వాయిస్ కూడా రికార్డు చేస్తుంది, రీప్లే కూడా చేస్తుంది. అది పాడయితే ఆ అరుగు మీద షాప్ కి రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ వెళ్ళాను. షాప్ గట్రా లేదు కానీ పక్క గేట్ లోపలనుంచి వెళ్లామన్నారు అక్కడ ఎవరో. లోపల ఒక అమ్మాయి టేబుల్ వేసుకుని అపార్ట్మెంట్ బేస్మెంట్ లో కూర్చుని ఉంది. నా సామాను రిపేర్ కు ఇచ్చి బయట షాపు ఆతను బందు చేసేసాడా అని ఆ అమ్మాయిని అడుగుతుండగా వాళ్ళ నాన్న అంటే ఆ వ్యక్తే ప్రత్యక్షమయ్యాడు. తాను ఆ బిల్డింగ్ కొని అపార్ట్మెంట్స్ గా చేసి అద్దెలకి ఇస్తున్నాడట. ఇప్పటికీ రేపైర్స్ చేస్తున్నాడట. పూర్వం నా పాత వస్తువుల గురించి చెప్తే ఆవే తనకు అల్లావుద్దీన్ అద్భుత దీపాలన్నాడు. ఇప్పటికి ఇది జరిగి ఐదేళ్ల పైనే అయింది. ఆ వ్యక్తి ఇప్పుడు కూడా అదేపని చేస్తున్నాడో ఏమో చూడాలి. మరి వింత గాడ్జెట్లు ఇప్పుడేమీ లేనట్లు ఉంది. ఎందుకనో అవి అన్నీ ఐఫోన్ల అప్లికేషన్ల లో వచ్చేస్తున్నాయి మరి. (ఇట్లు శేషు చామర్తి, హైదరాబాద్ )
No comments:
Post a Comment