ఎందుకో మనసు ఎలాగో ఉంది
ఎక్కవలసిన రైలు వెళ్లిపోయినట్లు;
నిజం గా ఇవ్వాళ రైటు టైము కి వెళ్ళిపోయింది.
అంతా నిశ్శబ్దం... ఒక ముష్తోడు తప్పితే....
టప్పు.. టప్పు... అని కొడ్తున్నాడు సత్తు గిన్నె,
నా ఒక్కడి గురించి అంత చప్పుడు దేనికో?
దగ్గరకి వెళ్ళా.. తిట్టటానికి, దురుసుగా.
పాపం వాడుకూడా రైలు ఎక్కాలంట!
నేను పక్క వూరిలో ఉద్యోగం, వాడు అక్కడ అడుక్కోవటం
ఇద్దరికీ పొట్టే కదా నింపుకోడానికి.
ఎంత , సంపాదన, అని అడిగా
నువ్వు ఇంకం టాక్సు కాదు కాదా, అడిగాడు.
గుర్తుకొచ్చింది నాకు అప్పుడు,
నేను నేలాఖర్నించి టాక్సు కట్టక్కర్లేదని,
రిటైరు అవుతున్నాను కదా మరి!
లూపు లైనులో సింగల్ లైను రూట్ ని తిట్టుకుంటూ,
బల్ల మీద కూల బడ్డా
టైం టేబులు చూస్తూ వెళ్ళ బుచ్చటానికి టైము.
ఎందుకో మనసు ఎలాగో ఉంది
ఎక్కవలసిన రైలు వెళ్లిపోయినట్లు….
No comments:
Post a Comment